చర్మ సంరక్షణకు చక్కని మార్గాలు

Durga
శీతాకాలంలో గాలులకు చర్మం పొడిగా, బిరుసుగా తయారవుతుంది. సహజంగానే ఏ విధమైన చర్మం కలిగినవారికైనా తెల్లగా, పొట్లిపోయినట్లుగా కళా విహీనంగా తయారవుతుంది. కొంతమందికి బాగా పగిలిపోయి ఇబ్బంది కలిగిస్తుంది. అలాంటి వారి చర్మం సంరక్షణ పట్ల మరింత శ్రద్ద చూపాలి. శీతాకాలంలో సబ్బు వాడకం ఎంత తగ్గిస్తే అంత మంచిది. సబ్బును, చర్మాన్ని పొడిబార్చే ఇతర ఉత్పత్తులను ఉపయోగించకూడదు. చలికాలంలో రాత్రి పడుకునే ముందు రోజూ చర్మానికి నైట్ క్రీములు రాసుకోవాలి. పాలు, పళ్ళు, చెరుకుతో తయ్యారయ్యే ఆల్ఫా హైడ్రోక్సి యాసిడ్స్ ఉండే క్రీములు రాసుకోవాలి. దీనివల్ల చర్మం పొడిగా అయి కళావిహీనంగా మారదు. మృదువుగా, మెరుస్తూ ఉంటుంది. ప్రోటిన్లు అధికాంగా తీసుకొంటే చర్మ గ్రంథులలోని తైలగ్రంథులు సక్రమంగా పనిచేసి చర్మానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కాపాడుతాయి. దీనివల్ల శీతాకాలంలో చర్మం ఎండిపోయి పగలటం వంటి ఇబ్బందలు ఏర్పడవు. ఈ కాలంలో ముఖం తప్పించి మిగిలిన శరీరభాగమంతా దుస్తులతో కప్పిఉంటుంది. కాబట్టి చలిగాలులు, దుమ్ము ప్రభావం ముఖంమీదే అధికం అందుకే ముఖసౌందర్యానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సాయంత్రం వేళ స్నానం చేసిన తర్వాత శరీరానికి నువ్వుల నూనెతోకానీ, ఆవనూనెతోగానీ, నెమ్మదిగా మర్థన చేయాలి. చర్మం పొడిగా ఉన్నవారు అర టీస్పూన్ రోజ్ వాటర్ లో ఒక టీ స్పూను తేనె కలిపి ముఖానికి రాయాలి. పదిహేను, ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. అలా చేస్తుంటే ముఖం కాంతివంతంగా, మృదువుగా తయారై మీ అందాన్ని రెట్టింపుచేస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: